Krishna Mukunda Murari:ఆదర్శ్ అంటే ఇష్టం లేదని చెప్పేసిన ముకుంద.. ఆ విషయం కృష్ణకి తెలిసేనా!
on Feb 26, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -403 లో..ముకుందకి కృష్ణ ముందే కాల్ రావడంతో మేనేజ్ చేస్తుంది. తను వెళ్ళిపోయాక కొద్దిలో తప్పించుకున్నాను కాసేపు ఉంటే కృష్ణకి డౌట్ వచ్చేది.. ఫోన్ లో కూడా మురారిని నా మొగుడు అని సేవ్ చేసుకునే ఫ్రీడమ్ లేదని ముకుంద అనుకుంటుంది. అప్పుడే ముకుంద దగ్గరికి కృష్ణ వస్తుంది సారీస్ తీసుకుని వచ్చాము కదా ఎలా ఉన్నాయో చూడని ముకుందని పంపించి మురారి ఫోన్ నుండి ముకుందకి కాల్ చేస్తుంది. అప్పుడు ముకుంద ఫోన్ లో మురారి అని వస్తుంది. అయ్యో నేనే అనవసరంగా తప్పుగా అర్థం చేసుకున్నానని కృష్ణ వెళిపోతుంది.
ఆ తర్వాత ముకుంద సారీ కట్టుకొని వచ్చేసరికి కృష్ణ ఉండదు. ఎక్కడికి వెళ్ళింది అనుకొని ఫోన్ చూస్తుంది. అందులో మురారి మిస్డ్ కాల్ అని ఉండడంతో ఇందాక కృష్ణ ఉన్నప్పుడు మురారి ఫోన్ చేస్తే నా మొగుడు అని వచ్చింది కదా అది డౌట్ వచ్చి మళ్ళీ కృష్ణ మురారి ఫోన్ నుండి నా ఫోన్ కి చేసినట్లుంది కానీ ముందు జాగ్రత్త కొద్ది మురారి అని సేవ్ చేసాను లేకపోతే నేను మారలేదన్న విషయం కృష్ణకి తెలిసిపోయేది. ఎవరికి డౌట్ వచ్చిన మేనేజ్ చెయ్యొచ్చు కానీ కృష్ణకి రావద్దని ముకుంద అనుకుంటుంది. ఆ తర్వాత కృష్ణ దగ్గరికి మురారి వచ్చి.. కాఫీ తీసుకొని రమ్మని చెప్పాను కదా ఏమైందని అడుగుతాడు. అది కాదు మీరు ఒక విషయం చెప్పండి ఇందాక కాఫీ కోసం నాకు ఫోన్ చేయాలి గాని ముకుందకి ఎందుకు చేశారని కృష్ణ అనగానే.... ఎందుకు అంటే నేను ముకుందని మర్చిపోలేదు మొదటి లవ్ కదా ఇలాగే ఉంటుందని ముకుందపై తనకి ప్రేమ ఉన్నట్లు మురారి చెప్పేసరికి అది నిజం అనుకొని కృష్ణ ఏడుస్తుంటుంది. మరి లేకపోతే ఏంటి నా మీదే డౌట్ పడతావా అని మురారి అంటాడు. సారీ అని చెప్పి మురారిని కృష్ణ హగ్ చేసుకుంటుంది.
ఆ తర్వాత మురారి వాకింగ్ కి వస్తాడు. అక్కడ ముకుంద ఎదరుపడుతుంది. తనకి ఆదర్శ్ అంటే ఇష్టం లేదని చెప్తుంది. నీపై ప్రేమని మరచిపోలేక తనపై లేని ప్రేమ నటించలేకపోతున్నాను. ఇక నా వల్ల కాదు ఆదర్శ్ ని వెనక్కి పంపు.. ఈ విషయం ఇంట్లో వాళ్లకి చెప్పకుండా నువ్వే అతన్ని పంపించేయ్.. రేపు శోభనం జరగకూడదు నువ్వు ఆపేయాలి లేదంటే నేను ప్రాణాలతో ఉండను.. ఈ విషయం ఎవరికి చెప్పొద్దని మురారికి ముకుంద చెప్పి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మురారి ఇంకా రాలేదని కృష్ణకి రేవతి చెప్తుంది. వాకింగ్ కి వెళ్లారు కదా అని కృష్ణ అంటుంది. మరొకవైపు ముకుంద మాటలన్నీ గుర్తుకు చేసుకుంటాడు మురారి. తరువాయి భాగంలో కృష్ణ కాఫీ తీసుకొని వచ్చి ముకుంద, ఆదర్శ్ లకు ఇచ్చి షేర్ చేసుకోమని చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
